🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 25 Oct, 2026 | Page: 1

మీ సమస్యలు చెప్పుకోండి.. 28న నల్గొండకు మానవ హక్కుల కమిషన్

మీ సమస్యలు చెప్పుకోండి..
28న నల్గొండకు మానవ హక్కుల కమిషన్
ఈనెల 28 న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నల్గొండ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు . గౌరవ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ 28వ తేదీ ఉదయము 8 గంటల 15 నిమిషాలకు హైదరాబాదులో బయలుదేరి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు నల్గొండ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారని తెలిపారు. ఉదయం 10 గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే ఉండి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అంతేకాక స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రులు సందర్శిస్తారని తెలిపారు.అనంతరం సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరి తిరిగి హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. ఎవరైనా వారి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ నెల 28 వ నేరుగా గౌరవ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కు సమర్పించవచ్చని అయిన వెల్లడించారు.
🏠 Home