🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 25 Oct, 2026 | Page: 1

తక్కువ తూకం వేస్తే తాట తీస్తాం..

తక్కువ తూకం వేస్తే తాట తీస్తాం..
నిబంధనలకు విరుద్ధంగా తూనికల పరికరాలు వినియోగిస్తున్న వ్యాపార సంస్థలపై అధికారులు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 24-10-2026న నల్గొండ పట్టణంలోని బియ్యం, కిరాణా దుకాణాలు, వంట నూనెల వ్యాపార సంస్థల్లో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల, డీటీ సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. తూనికల పరికరాల ధృవీకరణ, ముద్రలు, కొలతలకు సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. లీగల్ మెట్రాలజీ చట్టం-2009, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపార సంస్థలపై నాలుగు కేసులు నమోదు చేశారు. వ్యాపారులు ధృవీకరించి, ముద్రలు వేసిన తూనికల పరికరాలనే వినియోగించాలని, వినియోగదారులకు సరైన తూకం అందించాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్కువ తూకం లేదా తప్పు కొలతలు గుర్తిస్తే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని వినియోగదారులను కోరారు
🏠 Home