జన గణనలో తప్పులు దొర్లకుండా నిర్వహించాలి:అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
జన గణనలో తప్పులు దొర్లకుండా నిర్వహించాలి....
@ జనగణనకు ప్రజలు సరైన సమాధానం తెలిపి ఎన్యూమరేటర్లకు సహకరించాలి..
@ జనగణనలో 40 రకాల వివరాల సేకరణ....
@ జిల్లా స్థాయి, డివిజనల్, ఛార్జ్ అధికారులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహణ-రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్...
జనగణనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు.
గురువారం ఆయన ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో
జన గణనపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా , డివిజనల్ స్థాయి అధికారులు,చార్జ్ ఆఫీసర్లుకు (తహసీల్దార్లు), అదనపు చార్జ్ ఆఫీసర్లు (ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు) రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జన గణన రెండో దశ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్, విధివిధానాలు మరియు అధికారుల బాధ్యతల గురించి వివరించారు.
జన గణన రెండో దశను 2027, జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
స్వీయ గణన (Self Enumeration): 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు,
జన గణన 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించడం జరుగుతుందని,
అలాగే 2027 ఫిబ్రవరి 28 న రాత్రి ఇళ్లు లేని వారిని గణించడం జరుగుతుందని, రివిజనల్ రౌండ్ (Revision Round): 2027 మార్చి 1 నుంచి మార్చి 5 వరకు నిర్వహించడం జరుగుతుందని,
జన గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు ప్రతి గృహ యజమానిని సంప్రదించి మొత్తం (40) ప్రశ్నలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని,ప్రజలు ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని అందించి జనాభా గణన విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
జనాభా గణన ప్రక్రియను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు.
దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డి ఆర్ వో దశరథ, సిపిఓ శ్రీనివాస్ నాయక్, హైదరాబాద్ నుండి ట్రైనర్లు ఏ.వినయ్,గీత లు హాజరయ్యారు.