🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 15 Oct, 2026 | Page: 1

22A సమస్యల పరిష్కారంలో మరో కీలక ముందడుగు

22A సమస్యల పరిష్కారంలో మరో కీలక ముందడుగు
500 చ.గ.లోపు పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం
ఇప్ప‌టివ‌ర‌కు ఏడు ఉత్త‌ర్వులు జారీ, శ‌ర‌వేగంగా హామీలు అమలు
ఏళ్ల తరబడి ఎదురుచూపులు.. భూమిపై హక్కు కోసం నిరీక్షణలు ఫైళ్లకే పరిమితమైన దరఖాస్తులు.. దశాబ్ధాల చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు ప్రజాప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీ మేరకు 22A సమస్యల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కార్యాచరణ చేపట్టాము.
ఈరోజు డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 22-A సమస్యలపై ఉన్న‌తాధికారుల‌తో సుదీర్ఘంగా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా జి.ఓ. ఎంఎస్. నెం.59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను నెల రోజుల్లోగా పరిష్కరించాలని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు ఇవ్వ‌డంజ‌రిగింది. ఈ మేరకు గ‌తంలో జారీ చేసిన జీవో నెంబ‌ర్లు 14, 22, 29, 41 అనుగుణంగా మెమో నెంబ‌ర్. 48030ను జారీ చేయడం జరిగింది.
అదేవిధంగా గతంలో జీ.వో 59ను అనుస‌రించి జరిగిన అక్ర‌మాలు, త‌ప్పులు పున‌రావృతం కాకుండా అధికారులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఇప్ప‌టికే ప‌రిష్క‌రించ‌బ‌డిన క‌న్వేయ‌న్స్ డీడ్స్ ల జారీ అయిన కేసుల‌ను కూడా స‌మ‌గ్రంగా పరిశీలించాలని సూచించడం జరిగింది. ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌లో ఏమైనా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌లు ఉన్న‌ట్లు తేలితే ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వడం జరిగింది.
ఏళ్ల తరబడి భూమిపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు భరోసా కల్పిస్తూ, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం అనేక నిర్ణయాలను తెసుకోవడం జరిగింది.
ఇప్పటివరకు జి.ఓ.118, జి.ఓ.76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ, 22-ఎలో ఉన్నా GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు పరిష్కారం, ఉన్న‌త స్ధాయి క‌మిటీ ఏర్పాటుతో పాటు జి.ఓ. ఎంఎస్. నెం.59ని క‌లుపుకుని ఏడు ఉత్త‌ర్వులు జారీ చేయడం జరిగింది.
సమస్యలను కేవలం ఫైళ్లకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ,
అర్హులైన భూ సమస్యల బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
🏠 Home