అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసి నకిరేకల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పిలుపునిచ్చారు.

శుక్రవారం నల్గొండ జిల్లా, నకిరేకల్ లోని వినాయక బంకేట్ హాల్లో జిల్లా అధికారులతో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వం వెయ్యి రోజులలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ముఖ్యంగా 6 గ్యారంటీలు మొదలుకొని సన్న బియ్యం, స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నదని, విద్య ,వైద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని వేగవంతం చేయాలని, మొదలుపెట్టని పనులను తక్షణమే మొదలు పెట్టాలని, మంజూరు కావాల్సిన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. జిల్లా అధికారులు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను ఒక చాలెంజిగా తీసుకొని ప్రత్యేక విజన్ తో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని, దీని ద్వారా ప్రభుత్వంతోపాటు, అధికారులకు మంచి పేరు వస్తుందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేస్తే ప్రజల సమస్యలను సులువుగా తీర్చవచ్చని అన్నారు. అధికారులు ఆయా శాఖల వారీగా ప్రజలకు అవసరమున్న పనులను, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని, రాష్ట్రస్థాయి నుండి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే బాధ్యత తనదని అన్నారు.
ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులకు సంబంధించి పురోగతిలో ఉన్న రోడ్లను వేగవంతం చేయాలని, రామన్నపేట- అమ్మనబోలు రోడ్డు కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేగవంతం చేయాలని ,తక్కిన రోడ్లను పూర్తి చేయడం, మంజూరు కావలసిన రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పురోగతిలో ఉన్న, దెబ్బతిన్న రోడ్లు, మంజూరు కావాల్సిన రోడ్ల వివరాలను సమర్పించాలని ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కోరారు. అలాగే అంగన్వాడి భవనాలు, గ్రామ సమాఖ్య భవనాలు కూడా వేగవంతం చేయాలన్నారు. గ్రామాలలో గుంతలు పడి పూర్తిగా దెబ్బతిన్న రహదారుల ను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆసిఫ్ నగర్ కెనాల్ కు మరమ్మతులు చేపట్టాలని, ఐటిపాముల, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను వేగవంతం చేయాలన్నారు.ఎల్ నినో దృష్ట్యా ఇరిగేషన్ శాఖ ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని వారబందీ ప్రకారం ఇవ్వాలని కోరారు.
నకిరేకల్ నియోజకవర్గానికి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల బ్రాంచ్ ను తీసుకువచ్చే ఆలోచన ఉందని, అందువల్ల 696 సర్వే నంబర్లో ఉన్న 90 ఎకరాల భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులతో కోరారు. అలాగే బొల్లారంలో ఉన్న 300 ఎకరాల ప్రభుత్వ భూమిని సంరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు.
నకిరేకల్ లో బస్టాండు, పోలీస్ స్టేషన్ మార్పుకు సంబంధించిన అనుమతిని తక్షణమే మంజూరు చేయాలని అన్నారు.
గ్రామాలలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది లేకుండా మండలాల వారిగా తాగునీటికి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి, భూగర్భ జలాలు ఎక్కువగా వినియోగిస్తున్న గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా బల్క్ నీటి సరఫరా ఎక్కువ చేసేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
చెరువుగట్టు, ఐటిపాముల ప్రాంతాలలో గాంజా వినియోగం ఎక్కువగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసి గంజాను అరికట్టేందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని, నకరేకల్ లో పెట్రోలింగ్ పెంచాలని నల్గొండ డిఎస్పి ని ఆదేశించారు .
నకిరేకల్ లో నూతనంగా ప్రారంభించుకున్న 100 పడకల ఆసుపత్రిలో సౌకర్యాలు అన్నింటిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు అవసరమైన అంచనాలు రూపొందించి సమర్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కోరారు.
మంజూరైన సబ్స్టేషన్ల భూసేకరణను వేగవంతం చేయాలని ట్రాన్స్కో సూపరిండెంట్ ఇంజనీర్ తో కోరారు. ఎక్కడైనా లూస్ వైర్లు ఉన్నా, విద్యుత్తు కనెక్షన్ల కోసం డిడీలు కట్టిన వారికి తక్షణమే కనెక్షన్లు మంజూరు చేయాలని అన్నారు.
ఎల్ ని నోను దృష్టిలో ఉంచుకొని పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులను ప్రోత్సహించాలని, పాడి ద్వారా చిన్న , సన్న కారు రైతులు ఎక్కువ లాభపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
వ్యవసాయానికి సంబంధించి మండల స్థాయిలో తక్షణమే ఆత్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు స్నేహపూర్వక వాతావరణం లో ప్రజలకు సేవలు అందించాలని, ప్రజలు, గ్రామాలు, ప్రాంతాలు బాగుండాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో నగరికల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖలు, ఇరిగేషన్, రెవిన్యూ శాఖకు సంబంధించిన అధికారులు వారి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ విప్ కు తెలియజేయడమే కాకుండా, పనులలో వేగం ఉండేలా చూడాలని అన్నారు.
స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని, ఇంకా మొదలుపెట్టని వాటిని మొదలుపెట్టాలని, రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, నియోజకవర్గంలో ప్రతిపాదిత పనులు, పథకాలన్నీటిని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు .
ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు వారి శాఖకు సంబంధించి చేపట్టిన సమీక్షలో వారి శాఖకు సంబంధించిన పనులు, పథకాల వివరాలను తెలియజేశారు.
మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి శ్వేత, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల , జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు, సింగిల్ విండో చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు .