🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 16 Sep, 2026 | Page: 1

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ .

@ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ .
@ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ఈ నెల 17 న (గురువారం) నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతితిగా హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ తో కలిసి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ మైదానంలో వేడుకలకు హాజరయ్యే వారికి తాగునీరు, టెంట్లు,కుర్చీల వంటి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు వారి సిబ్బందితో సహా ఉదయం
9.30 గంటలకే పోలీస్ పరేడ్ మైదానంలో హాజరుకావాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, ప్రజాపాలన దినోత్సవం లో భాగంగా ముఖ్య అతిథి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని , అనంతరం పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు.అన్ని వేడుకల మాదిరిగానే సంబంధిత శాఖల అధికారులు ప్రజాపాలన దినోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమే కాకుండా, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు.పోలీస్ పరేడ్ మైదానంలో నిరంతర విద్యుత్ సరఫరా, పరిశుభ్రత,పబ్లిక్ అడ్రెస్ సిస్టం, ప్రథమ చికిత్స తదితర అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రజా పాలన దినోత్సవ ఆహ్వాన పత్రికలను శాసన మండలి చైర్మన్,గౌరవ మంత్రులు,పార్లమెంట్ సభ్యులు,శాసన మండలి,శాసన సభ సభ్యులు,ఇతర ప్రజాప్రతినిధులందరికీ అందేలా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారిని, ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు,కార్యాలయాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని,మున్సిపాలిటీలు,గ్రామపంచాయతీలలో స్థానిక ప్రజాప్రతినిధులను వేడుకలకు ఆహ్వానించాలని,జాతీయపతాక నిబంధనలు తప్పకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పోలీస్ తరఫున సమ్మన్ గార్డ్,బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తెలిపారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయక కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్,డి ఆర్ ఓ దశరథ్, ఆర్డీవో వై .అశోక్ రెడ్డి, డి ఈ ఓ, డి వై ఈ ఓ సుశీంధర్ రావు,దశ్రు నాయక్,మున్సిపల్ కమిషనర్ వంశీ ,తహసీల్దార్ పరుశురాం,ఇతర అధికారులు ఉన్నారు.
🏠 Home