🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 10 Sep, 2026 | Page: 1

హాస్టళ్ల భద్రతపై హైడ్రా కీలక నిర్ణయం.

హాస్టళ్ల భద్రతపై హైడ్రా కీలక నిర్ణయం.
హాస్టల్ నిర్వాహకులకు 3 నెలల గడువు
జనవరి 1 నుంచి హైడ్రా తనిఖీలు
ప్రమాదకర భవనాల్లో హాస్టళ్ల నిర్వహణపై చర్యలు.
హాస్టళ్లలో భద్రతకు రాజీ లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రమాదకర, అనుమతులు లేని భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లను 3 నెలల్లో సురక్షిత భవనాలకు తరలించాలని సూచించారు. జనవరి 1 నుంచి తనిఖీలు చేపట్టి, కూలే ప్రమాదం ఉన్న భవనాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, భవన పటిష్టత, పార్కింగ్ వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు.
🏠 Home