లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, గోవింద్ రామ్

సంగారెడ్డి పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేసి, అనుకూల (పాజిటివ్) నివేదిక ఇవ్వడానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద రామ్ 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు.
లంచం మొత్తంలో బాధితుడు గత వారంలోనే 30,000 రూపాయలు చెల్లించినప్పటికీ, మిగిలిన 20,000 రూపాయల కోసం అధికారి వేధింపులకు గురిచేశారు. వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా వ్యూహంతో దాడికి రంగం సిద్ధం చేశారు.ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బాధితుడి నుంచి మిగిలిన 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా గోవింద రామ్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, విద్యాధికారి గోవింద రామ్‌పై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు వేగవంతం చేశారు.