🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 07 Sep, 2026 | Page: 1

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.
మాజీ శాసనసభ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు గారి స్మారకార్థం ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాల్’గా నామకరణం చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి *శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు* పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచే శాసనసభలో నూతన సెంట్రల్ హాల్ అందుబాటులోకి రావడం సంతోషకరం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అన్నారు.
🏠 Home