🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 02 Sep, 2026 | Page: 1

నకిరేకల్ మునుగోడు నియోజకవర్గాల నుండి భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ అభిమానులు....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత డాక్టర్.వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17 వర్ధంతి సందర్భంగా తన సొంత గ్రామమైన నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్దంల లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు....

నకిరేకల్ మునుగోడు నియోజకవర్గాల నుండి భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ అభిమానులు....

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్......

నాయకుడు అంటే ఎలా ఉండాలి పేద ప్రజలకు ఏవిధంగా అండగా ఉండాలి అనే స్పూర్తి ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.

కార్పొరేట్ హాస్పటల్ లో ఈ రోజు పేదవారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటే ఆది ఆయన పుణ్యమే.

రైతులకు ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది వైయస్సార్

పేద ప్రజల కోసం, రైతుల కోసం ఆయన తీసుకొచ్చిన పథకాలు దేశ చరిత్రలో ఏ నాయకుడు తీసుకురాలేదు.

ఈ ప్రాంత కరువు, ఫ్లోరైడ్ ను తరలించడానికి ఉదయసముద్రం ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత ఆయనదే.

10సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ను పట్టించుకో కుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇచ్చాం.

రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పని చేస్తాం. ఆయన మాట ఇస్తే మడమ తిప్పం అని ఎలా ఉన్నాడో మేము కూడా అలానే ఇప్పటికీ ఉన్నాం.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నాయకులను తీసుకోవడం మంచిదే.. కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని వెలగొడతాం అంటే ఊరుకోం

రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమే.. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వాళ్ళ తరుపున రాజగోపాల్ రెడ్డి పోరాడుతాడు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం....
🏠 Home