🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 01 Sep, 2026 | Page: 1

*రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి*


*కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త*
పైడా కృష్ణ ప్రసాద్ మిత్రబృందం మరియు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆల్ ఇండియా రేడియో జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించిన కీ.శే. గౌరవ శ్రీ కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర HRD, IT & Electronics శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు పాల్గొని రోశయ్య గారికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా TPCC ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ
ప్రజాసేవలో రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం అని ఆయన అన్నారు కొణిజేటి రోశయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, , గవర్నర్‌గా వివిధ కీలక పదవుల్లో పనిచేసి ప్రజాసేవకు విశేషంగా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిజాయితీ, నిరాడంబరత, నిబద్ధత, రాజ్యాంగ విలువలకు కట్టుబాటు వంటి లక్షణాలతో ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహనీయుడు కొణిజేటి రోశయ్య గారని అన్నారు.
పదవులు ఎన్నో వచ్చినా సాధారణ జీవన విధానాన్ని కొనసాగిస్తూ, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసిన రోశయ్య గారి రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు.
ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణం అని ఆయన అన్నారు
కొణిజేటి రోశయ్య గారు ఆర్యవైశ్య సమాజానికి చెందిన ప్రముఖ నాయకుడిగా, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి గర్వకారణంగా నిలిచారని మంత్రి గారు అన్నారు.ఆయన స్ఫూర్తితో యువత ప్రజాసేవ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. రోశయ్య గారి జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పైడా కృష్ణ ప్రసాద్ మిత్రబృందం మరియు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులను ఆయన అభినందించారు.
కొణిజేటి రోశయ్య గారి విగ్రహం భవిష్యత్ తరాలకు ఆయన చేసిన ప్రజాసేవను గుర్తుచేసే స్ఫూర్తి చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆయన పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేస్తాం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో Eluru మాజీ ఎమ్మెల్యే అంబిక కృష్ణ గారు, రోశయ్య గారి కుమారు లు శివ సుబ్బారావు ,మూర్తి అల్లుడు ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ డుండి రాకేష్ గారు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, పైడా కృష్ణ ప్రసాద్ మిత్రబృందం సభ్యులు, వివిధ రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు మరియు రోశయ్య గారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home