🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 28 Aug, 2026 | Page: 1

సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ!

సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ!
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణ మొదలైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ్‌ తాలూకా లింగదహళ్లి గ్రామంలో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్‌ కూడా హాజరయ్యారు. దేవదుర్గ్‌ బ్లాక్‌ అన్వేషణ హక్కులు సింగరేణికి అనంతరం భట్టి ఖనిజ అన్వేషణ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్‌లో దేవదుర్గ్‌ బ్లాక్‌ అన్వేషణ హక్కులు సింగరేణికి దక్కగా, తెలంగాణా డిప్యూటీ సీఎం ఆ సర్వేను ప్రారంభించారు.ఇక్కడ బంగారం, రాగి విరివిగా లభిస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి త్వరలోనే దేవదుర్గ్ లో ఆఫీస్ తో పాటుహెలీ ప్యాడ్ సింగరేణి త్వరలోనే ఈ ప్రాంతంలో ఆఫీస్‌, హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న తెలుగు, కర్ణాటక ప్రజల మధ్య బంధం బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి అధికారులు సేకరించిన వివిధ ఖనిజ నమూనాల ప్రదర్శనను చూసి వివరాలు తెలుసుకున్నారు. లింగదహళ్లిలోని పరమానంద శివాలయంలో పూజలు కూడా నిర్వహించారు. సింగరేణి, కర్ణాటక విద్యుత్‌ సంస్థ మధ్య జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదన అదే రోజు బెంగళూరులో కర్ణాటక ఇంధనశాఖ మంత్రి కె.జె.జార్జ్‌తో తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగరేణి, కర్ణాటక విద్యుత్‌ సంస్థ మధ్య జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదన చేశారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో బొగ్గు తవ్వకాల్లో కలిసి పనిచేయాలని సూచించగా జార్జ్‌ సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో పారిశ్రామికవృద్ధి కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోందని, థర్మల్‌ ప్లాంట్లకు తెలంగాణ బొగ్గు నిరంతరం సరఫరా చేయాలని కోరగా భట్టి విక్రమార్క అంగీకరించారు.
దేశ సంపదను పెంచడానికి దోహదం చేసేలా రెండు రాష్ట్రాల సహకారం సమావేశంలో కర్ణాటక అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గౌరవ్‌ గుప్తా, కేపీసీఎల్‌ ఎండీ రాజేంద్ర చోళన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్యలు రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ సహకారం పెంపొందించి, దేశ సంపదను పెంచడానికి దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. సింగరేణి క్రిటికల్‌ మినరల్స్‌పై దృష్టి సారించడం ద్వారా ఉపాధి, అభివృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని కూడా భావిస్తున్నారు.
🏠 Home