🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 21 Aug, 2026 | Page: 1

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యంమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు

శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం, లోక్యతండ గ్రామాన్ని సందర్శించి ఇంటింటా కాలినడకన తిరుగుతూ
గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందించడమే తమ లక్ష్యమన్నారు.గ్రామ సమస్యలు, ముఖ్యంగా ఎస్ సి,ఎస్టీ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.గ్రామ పర్యటనలో ముందుగా దాస్ అనే రైతును కలెక్టర్ పలకరిస్తూ ఎంత భూమిలో పంట సాగు చేస్తున్నారని? అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరం భూమిలో సాగు చేస్తున్నట్లు రైతు తెలపగా, మరో ఎకరంలో కందులు వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వర్షపాతం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.
గ్రామానికి చెందిన మరో వ్యక్తి తనకు పింఛన్ రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, పరిశీలించి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో 43 పింఛన్లు ఉండగా అదనంగా మరో 13 పింఛన్లు మంజూరు చేయనున్నట్లు, తెలిపారు.
గ్రామంలో మంచినీటి సమస్యను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సుమారు 40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవని తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి నీటి సరఫరా లైన్‌ను పరిశీలించి ఓహెచ్‌ఎస్‌ఆర్‌కు కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి నీటి సమస్యను తెలుసుకున్న ఆయన, ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని ఎంపీడీవోను ఆదేశించారు.
గుడిసెలో నివసిస్తున్న ధనావత్ కృష్ణకుమారి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలపగా, కలెక్టర్ వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలను పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.
అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయించామని తెలిపారు. గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు రెండు డ్రైనేజీ పనులను మంజూరు చేసినట్లు తెలిపారు. పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.గ్రామపంచాయతీలో తీర్మానం చేసుకుని పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థులకు సోమవారం నుండి యూనిఫారాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.గ్రామంలో వీవో భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన స్థలాలను ఆర్డీవో సర్వే చేసి పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయవద్దని, పారిశుద్ధ్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పాటించే పరిశుభ్రత భావితరాలకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అనంతరం కలెక్టర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, కిచెన్ షెడ్ నిర్మాణం, పెయింటింగ్ పనులకు అంచనాలు సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు.
ఆశా కార్యకర్తలను కలిసి పిల్లలందరికీ అన్ని రకాల టీకాలు వేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
గ్రామ పర్యటనలో చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తు ఏ తరగతి చదువుతున్నారు? చదువు ఎలా సాగుతోంది? అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామ పర్యటనలో ఆర్డీవో రమణారెడ్డి, తహసిల్దార్ జి .ప్రమీల, ఎంపీడీవో విజయ కుమారి,సర్పంచ్ జ్యోతి కాంతారావు, కార్యదర్శి నాగరాజు, ఎస్టి సంగం శ్రీనివాస్ నాయక్, కాంతారావు, గ్రామస్తులు ఉన్నారు.
__________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

🏠 Home