ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం మ్యాపింగ్ కానీ, జాబితాలో పేర్లు తేడా ఉన్న కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం మ్యాపింగ్ కానీ, జాబితాలో పేర్లు తేడా ఉన్న కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు.
బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నల్గొండ జిల్లాలో ముసాయిదా
ఓటరు జాబితా ప్రచురణ అనంతరం 33,818 అన్‌మ్యాపింగ్ 2,34,972 అనామలీస్ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ ప్రక్రియను నిర్వహిస్తామని వివరించారు.జిల్లాలో ప్రస్తుతం
6 ఈఆర్‌ఓలు, 12 మంది ఏఈఆర్‌ఓలు ఉన్నారని, అదనంగా మరో 12 మంది ఏఈఆర్‌ఓలు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో బూతు స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం జారీ చేసే నోటీసులను సంబంధిత బీఎల్‌ఓలు, సూపర్వైజర్లు, ఏఈఆర్‌ఓలు, ఈఆర్‌ఓలు సక్రమంగా అందజేయాలని చెప్పారు. నోటీసులు అందించిన వ్యక్తుల సంతకాలను తీసుకోవాలని, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.అదేవిధంగా ఫారం-6, ఫారం-7, ఫారం-8లకు సంబంధించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, వారికి పూర్తి వివరాలను తెలియజేయాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పూర్తిగా పారదర్శకంగా రూపొందించేలా లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవిన్యూ అధికారి దశరథ ,
ఎలక్షన్ అధికారులు హాజరయ్యారు.