🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 19 Aug, 2026 | Page: 1

నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ దారుణ హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్




“నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ దారుణ హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ – నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేసి నివేదిక సమర్పించాలని ఎస్పీకి ఆదేశం”

************

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం, జేబీ కాలనీలోని తన నివాసంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ శ్రీమతి కుల్లు రూపా రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది.

ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గౌరవ చైర్‌పర్సన్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ నిందితులను ఇంకా గుర్తించక పోవడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మీడియా కథనాలు, ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.

నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయడంతో పాటు.. ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని నల్గొండ జిల్లా ఎస్పీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

మహిళలపై జరిగే ఇటువంటి తీవ్రమైన హింసాత్మక ఘటనలను అత్యంత ప్రాధాన్యతతో విచారించి, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చైర్‌పర్సన్ అన్నారు.

ఈ కేసు దర్యాప్తు పురోగతిని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు స్పష్టం చేశారు.
🏠 Home