🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 18 Aug, 2026 | Page: 1

వచ్చే నెలలో సూపర్ ఎల్ నినో వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని రిజర్వాయర్లలో జూన్ 2027 వరకు నీటిని తాగు నీటి అవసరాల నిమిత్తం నిల్వ ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను చీఫ్ ఇంజనీర్ శ్


వచ్చే నెలలో సూపర్ ఎల్ నినో వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని రిజర్వాయర్లలో జూన్ 2027 వరకు నీటిని తాగు నీటి అవసరాల నిమిత్తం నిల్వ ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న నీటిని తాగునీటి కోసం, పశువుల కోసం వినియోగించాలని, పంటల కోసం ఏ ప్రాజెక్టు నుండి నీరు వదలడం జరగదని, అయితే డిండి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మిషన్ భగీరథ నీటి సరఫరా లేనందున పాత డిండి ప్రాజెక్టు కింద మాత్రం 12,875 ఎకరాలకు సాగునీటిని ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు.జిల్లాలోని తక్కిన అన్ని ప్రాజెక్టులలో కేవలం తాగునీటి కోసం మాత్రమే. నీటిని వినియోగించుకునేందుకు నీటిని రిజర్వాయర్లలో నిలువ ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైనా రైతులు ప్రాజక్టుల కింద పంటలు వేసుకున్నట్లయితే వాటిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో పంటలకు మాత్రం సాగునీరు వదిలిపెట్టడం జరగదని ఆయన స్పష్టం చేశారు.
🏠 Home