🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 18 Aug, 2026 | Page: 1

ఇరిగేషన్ ప్రాజెక్టుల భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రాజెక్టుల భూసేకరణ , పునరావాసం పై ఆయన సమీక్షించారు.
జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ కు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని , అయా
ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ బృందం ద్వారా పునరావాస ప్యాకేజీలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రైతులకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేయాలని ,
సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను పరిష్కరిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చూడాలన్నారు.
🏠 Home