కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా
చౌటుప్పల్: ఆత్మగౌరవం కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్ర అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
చౌటుప్పల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. తాను నిన్న చేసిన వ్యాఖ్యలపై మరోసారి మీడియాకు వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
తాను ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదని, బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పానని అన్నారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఉండాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం నడవకూడదని కోరుతున్నానని పేర్కొన్నారు.
ప్రజా పాలన అంటే పేదల కోసం పనిచేయాలని, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల ప్రయోజనాల కోసం కాదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.