🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 12 Aug, 2026 | Page: 1

బీజేపీలో రాజాసింగ్ రీఎంట్రీ.. నేతలతో చర్చలు ముమ్మరం!

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తిరిగి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గత ఏడాది జూన్ 30న పార్టీకి రాజీనామా చేసిన ఆయన, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, రాజాసింగ్‌ను తిరిగి పార్టీలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో బలం పెరుగుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దీంతో ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైందని సమాచారం.
🏠 Home