🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 06 Aug, 2026 | Page: 1

తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి

తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పక్కన గల వారి విగ్రహానికి... నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సిద్ధి కొరకు.. తాను విద్యార్థిగా ఉన్నప్పటినుండే అహర్నిశలు కృషి చేసినారని, వారు చూపిన మార్గం, సిద్ధాంతాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, ఉద్యమ కాలంలో కేసీఆర్ కు వెన్నుదన్ను గా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారని కొనియాడారు.
అలాంటి జయశంకర్ గారి పట్ల
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం.. అవమానకరంగా ప్రవర్తిస్తుందని, నల్లగొండలోని వారి విగ్రహానికి , అలంకరణ చేసి దండలు వేసే పరిస్థితి కూడా లేకపోయిందని వారు ఘాటు గా విమర్శించారు,రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం..ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పాలన కొనసాగిస్తుందని, ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆశయాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు ...
ఈ కార్యక్రమంలో... JAC మాజీ చైర్మన్ గుండె వెంకటేశ్వర్లు.. నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్ రావు లోడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి సిరిగిరి వెంకట్ రెడ్డి అయితగోని యాదయ్య,మారగొని గణేష్, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా,రత్నగిరి శ్రీనివాస్, గోపగోని స్వాతి రాజశేఖర్, సింగం లక్ష్మి, దండంపెల్లి సత్తయ్య, భాషపాక హరికృష్ణ కౌకూరు వీరాచారి A.కన్నారావు, కందుల లక్ష్మయ్య,కంకణాల వెంకటరెడ్డి, వజ్జ శ్రీనివాస్, తంగేళ్లపల్లి రవీంద్ర చారి శాగటి రాములు తదితరులు పాల్గొన్నారు
🏠 Home