🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 05 Aug, 2026 | Page: 1

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు

పద్మానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు!

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో చట్టాలపై చిన్నప్పటి నుంచే అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించిన షీ టీం ..

ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులు చట్టరీత్యా నేరమని హెచ్చరిక...

ఆన్‌లైన్‌లో అపరిచితులతో స్నేహం చేయొద్దు.. వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవద్దని సూచన...

మహిళలు, బాలికల భద్రతకు షీ టీం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా...

గంజాయి సహా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించిన పోలీసులు...

పోలీస్ కళాబృందం ఇంచార్జ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, బాలల రక్షణపై ఆటపాటలతో అవగాహన...

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పి. ఉష,హెడ్ కానిస్టేబుల్ నర్సింహ,షీ టీం కానిస్టేబుల్ రమేష్,పోలీస్ కళాబృందం సభ్యులు పురుషోత్తం, మురళి, కవిత విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఉపాధ్యాయులు విజయ్ కుమార్, నరేష్, అనిల్, ఖలీమ్మొద్దీన్, రామకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు
🏠 Home